కొరియన్ మూవీ రీమేక్ లో రెజీనా .. నివేద థామస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొరియన్ మూవీ రీమేక్ లో రెజీనా .. నివేద థామస్

  • హిట్ కొట్టిన 'మిడ్ నైట్ రన్నర్స్'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు 
  • శిక్షణ తీసుకుంటున్న రెజీనా, నివేద   
కొత్త కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రీమేక్ కంటెంట్ అయినప్పటికీ ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొరియన్ మూవీ రీమేక్ గా వచ్చిన 'ఓ బేబీ' భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో మరో కొరియన్ మూవీని రీమేక్ చేయడానికి నిర్మాత సురేశ్ బాబు రంగంలోకి దిగారు.

2017 లో వచ్చిన 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ మూవీ అక్కడ వైవిధ్యభరితమైన చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు పోలీస్ శిక్షణలో వుంటారు. ఓ అర్ధరాత్రివేళ వాళ్లు విలన్ ను తరుముతూ వెళతారు. అప్పుడు ఏం జరిగిందనేదే కథ.

కొరియన్ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండగా, తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి హీరోయిన్స్ తో ఈ కథను చేస్తే కొత్తగా ఉంటుందని భావించారు. ఆ రెండు పోలీస్ పాత్రలకి రెజీనా - నివేద థామస్ లను తీసుకున్నారు. ఒరిజినల్ మూవీకి ఫైట్ మాస్టర్స్ గా చేసినవారే ఈ తెలుగు సినిమాకి పనిచేయనున్నారట. వాళ్ల దగ్గరే రెజీనా - నివేద శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం.
Regina
Niveda Thomas
korean Movie Remake

More Telugu News