'జాన్' టైటిల్ ఖాయమైపోయినట్టే!
- ఈ శుక్రవారం విడుదలవుతోన్న 'జాను'
- 'జాన్' నిర్మాతలను కలిశాను
- సందేహాలకి తెరదించిన 'దిల్' రాజు
'దిల్' రాజు నిర్మించిన 'జాను' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. '96' సినిమాలో కథానాయిక పేరు 'జాను' .. అదే దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా కావడం వలన ఆయన ఆ పేరును టైటిల్ గా పెట్టాడు. ఈ టైటిల్ .. ప్రభాస్ 'జాన్'కి దగ్గరగా ఉండటం వలన నేను ఆ నిర్మాతలను కలిశాను. తమకి అభ్యంతరం లేదని వాళ్లు చెప్పిన తరువాతనే ఖాయం చేసుకున్నాను. 'జాను' టైటిల్ కి దగ్గరగా ఉందని చెప్పేసి వాళ్లు కూడా 'జాన్' టైటిల్ ను మార్చడం లేదు. ఎందుకంటే మా సినిమా తరువాత చాలా కాలానికి 'జాన్' వస్తుంది" అని ఆయన అన్నారు.