యాంకర్ ప్రదీప్ ను చూస్తూ మా అమ్మ అలా అనేది: నటుడు అభినవ్ గౌతమ్
Add ap7am to your home Screen

యాంకర్ ప్రదీప్ ను చూస్తూ మా అమ్మ అలా అనేది: నటుడు అభినవ్ గౌతమ్

  • చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాడిని 
  • ఆర్టిస్టును కావాలని అప్పట్లో అనుకోలేదు 
  • యాంకర్ ప్రదీప్ నా సీనియరన్న అభినవ్
'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో నటుడిగా అభినవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను పంచుకున్నాడు. "నేను ఇంజనీరింగ్ చదివాను .. నిజం చెప్పాలంటే మా పేరెంట్స్ కోరిక మేరకు పూర్తిచేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాడినిగానీ, ఆర్టిస్టును అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే నటన వైపుకు వద్దామనుకున్నప్పుడే ఇండస్ట్రీ ఎలా వుంటుందనే విషయంలో నాకు ఒక అవగాహన వచ్చింది.

నేను ఇంజనీరింగ్ ఫస్టు ఇయర్ చదువుతున్నప్పుడు, అదే కాలేజ్ లో యాంకర్ ప్రదీప్ ఫోర్త్ ఇయర్లో ఉండేవాడు. కాలేజ్ ఫంక్షన్స్ లో ఆయన స్టేజ్ పై డాన్సులు చేసేవాడు. ఆ తరువాత యాంకర్ గా బాగా పాప్యులర్ అయ్యాడు. ఆయన నా సీనియర్ అని టీవీలో చూపిస్తూ మా అమ్మకి చెప్పాను. అప్పటి నుంచి 'నువ్వు కూడా అలా చేయవచ్చు గదా' అని మా అమ్మ మొదలెట్టింది. కష్టపడి యాంకర్ ప్రదీప్ ఈ స్థాయికి వచ్చాడు. అందువల్లనే నేను కూడా గట్టి పట్టుదలతో నటుడిగా అడుగులు వేశాను" అని చెప్పుకొచ్చాడు.
Abhinav
Pradeep
Meeku Matrame Cheptha Movie

More Telugu News