అడగ్గానే టైటిల్ ఇచ్చినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్: దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడగ్గానే టైటిల్ ఇచ్చినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్: దిల్ రాజు

  • చిత్ర నిర్మాణంలో దిల్ రాజు బిజీ
  • త్వరలో విడుదల కానున్న జాను
  • ప్రభాస్ కొత్త చిత్రం జాన్!
  • దగ్గరగా ఉన్న రెండు టైటిళ్లు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు షెడ్యూల్ ఊపిరి తిప్పుకోలేనంత బిజీగా ఉంది. ప్రస్తుతం ఆయన 'జాను' చిత్రంతో జర్నీ చేస్తున్నారు. ఆ తర్వాత 'వి' చిత్రం రానుంది. ఆపై పవన్ కల్యాణ్ తో 'పింక్' రీమేక్ పట్టాలెక్కించనున్నారు. శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'జాను' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. తమిళంలో వచ్చిన '96' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించిన 'జాను' చిత్రం టైటిల్ గురించి చెప్పారు. '96' రీమేక్ కు టైటిల్ గురించి ఆలోచించగానే 'జాను' అనే పేరు అయితే బాగుంటుందనిపించిందని తెలిపారు.

కానీ ప్రభాస్ నటిస్తున్న సినిమాకు 'జాన్' అనే టైటిల్ పెడుతున్నట్టు తెలియడంతో యూవీ క్రియేషన్స్ వాళ్లను సంప్రదించానని చెప్పారు. కొన్నిరోజుల అనంతరం యూవీ క్రియేషన్స్ నుంచి ఫోన్ వచ్చిందని, 'జాను' టైటిల్ పెట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. తమ చిత్రం వచ్చేందుకు చాలా సమయం ఉందని, ఇప్పటికప్పుడు టైటిల్ తో వచ్చిన ఇబ్బందేమీ లేదని వారు భరోసా ఇచ్చారని దిల్ రాజు తెలిపారు. అడగ్గానే టైటిల్ ఇచ్చినందుకు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని తెలిపారు.
Dil Raju
Prabhas
Title
Janu
Jan
Tollywood

More Telugu News