బీఎస్-6 ప్రమాణాలతో కొత్త స్కూటర్ తీసుకువచ్చిన హీరో
- మార్కెట్లోకి సరికొత్త ప్లెజర్ ప్లస్ స్కూటర్
- ప్రారంభ ధర రూ.54,800
- 10 శాతం అదనపు మైలేజీ ఇస్తుందంటున్న కంపెనీ
తాజా మోడల్ కు రెట్రో లుక్ తో మరింత సొబగులు అద్దారు. క్రోమ్ హెడ్ ల్యాంప్, ఆకర్షణీయమైన సీటింగ్, పొందికైన రూపం దీని ప్రత్యేకతలు. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించడమొక్కటే తప్ప ఇంజిన్ శక్తిలో ఎలాంటి మార్పులేదు. అయితే, బీఎస్-4 మోడల్ తో పోల్చితే తాజా మోడల్ 10 శాతం అదనపు మైలేజీ ఇస్తుందని హీరో మోటోకార్ప్ చెబుతోంది.