Chennai: చెన్నైలో ఒకే రోజు రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు.. జనం బెంబేలు!

షార్ట్స్‌లో చూడండి
చెన్నై విమానాశ్రయంలో కరోనా వైరస్ కలకలం రేపింది. మలేషియా నుంచి వచ్చిన చైనా వ్యక్తికి కరోనా వైరస్  లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చైనాకు చెందిన వల్లూజిన్ అనే వ్యక్తి మలేషియా నుంచి చెన్నై వచ్చాడు. విమానాశ్రయంలో అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వెంటనే రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సింగపూర్ నుంచి వచ్చిన మరో వ్యక్తిలోనూ ఇవే లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చెన్నై విమానాశ్రయం ఒకే రోజు ఇద్దరి వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో జనం వణుకుతున్నారు. కాగా, ఈ రెండు కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Go Back to Shorts
Chennai
China
Corona Virus
singapore

More Telugu News