karona virus: కరోనా వైరస్ భయంతో.. ‘కరోనా బ్రాండ్ బీర్ల’ అమ్మకాలు డౌన్!

షార్ట్స్‌లో చూడండి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్ లో బీర్ల అమ్మకాలకు గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. భారత్ లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడ్డట్లు కేసులు నమోదు కానప్పటికీ.. ఈ వైరస్ వ్యాపించిందేమోనని ప్రజల్లో భయం నెలకొంది. చైనాలో ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తులు ఇప్పటికే వందకు పైగా మరణించారు. కాగా, ఈ వైరస్, కరోనా బ్రాండ్ పేరుతో ఉన్న బీరు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

ఈ బీరు తాగితే వైరస్ సోకుతుందా? అంటూ భారత్ లో బీరు ప్రియుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ బ్రాండ్ ను కొనుగోలు చేయటానికి వెనుకంజవేస్తున్నారు. దీనిపై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గూగూల్ ను ఆశ్రయిస్తున్నారు. కరోనా బీరు వైరస్, కరోనా బీరుతో వైరస్ సోకుతుందా? అని టైప్ చేస్తూ గూగుల్ లో వెతుకుతున్నారు. ఈ ప్రశ్నలను సంధిస్తున్న వారిలో భారత్ లోని కరోనా బ్రాండ్ బీరు ప్రియులతోపాటు, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా ఉన్నారు.
Go Back to Shorts
karona virus
Beer sales
Karona beer brand
India
China

More Telugu News