వైద్యుడే నిజమైన హీరో: పూజ హెగ్డే
- క్యాన్సర్ బాధిత చిన్నారులకోసం రూ.2.5 లక్షల విరాళం
- ప్రతి ఒక్కరూ ఇలాంటి వారికి సాయం చేయాలి
- ఆర్థిక సాయం చేసి ఇలాంటి బాధితులను ఆదుకోవాలి
తాను వైద్యుల కుటుంబం నుంచి వచ్చానని.. తన స్నేహితులు కూడా వైద్యులేనని చెప్పారు. వైద్యుడే నిజమైన హీరో అని భావిస్తాను అని పూజ పేర్కొన్నారు. ‘ క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం తగినన్ని నిధులను సమకూర్చి వారి జీవితాలను కాపాడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి పనులు చేయాలని అనుకుంటారు. అయితే అవి ఎలా చేయాలన్న దానిపై వారికి అవగాహన ఉండదు. ఇలాంటి సంస్థలకు ఆర్థిక సాయం చేసి బాధిత చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాను’ అని ఆమె అన్నారు.