పూజా హెగ్డేకి బాగోలేకపోవడం వల్లనే షూటింగ్ వాయిదా పడిందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూజా హెగ్డేకి బాగోలేకపోవడం వల్లనే షూటింగ్ వాయిదా పడిందట!

  • 'జాన్' షూటింగుకి రాలేకపోయిన పూజా 
  • రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ల నిర్మాణం
  • ఆస్ట్రియా షెడ్యూల్ గురించిన ఆలోచన  
ప్రస్తుతం వరుస సినిమాలతో పూజా హెగ్డే ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ఒక వైపున వరుస షూటింగులు .. మరో వైపున సక్సెస్ వేడుకలు. ఈ కారణంగానే ఆమె అలసిపోయి అనారోగ్యానికి గురైనట్టుగా సమాచారం.

ప్రభాస్ జోడిగా ఆమె చేస్తున్న 'జాన్' తాజా షెడ్యూల్ నిన్న హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో మొదలుకావలసి వుంది. అయితే పూజా హెగ్డే అనారోగ్య కారణాల వలన రాలేకపోవడంతో షూటింగ్ వాయిదా పడినట్టుగా చెబుతున్నారు. ఆమె కాంబినేషన్ లేకుండా అక్కడ ప్లాన్ చేసిన సన్నివేశాలను కానిచ్చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారట. అయితే భారీ సెట్ల నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం. మరీ ఆలస్యమయ్యేలా వుంటే, ముందు ఆస్ట్రియా షెడ్యూల్ ను పూర్తి చేసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Prabhas
PoojaHegde

More Telugu News