జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం.. బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ అరెస్ట్
Add ap7am to your home Screen

జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం.. బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ అరెస్ట్

  • సినిమాల్లో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల
  • ఐదేళ్లుగా సాగుతున్న దందా
  • విటుల్లా రంగంలోకి దిగి ఆటకట్టించిన పోలీసులు
జూనియర్ ఆర్టిస్టులతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్న బాలీవుడ్ కు చెందిన ఓ క్యాస్టింగ్ డైరెక్టర్‌కు ముంబై పోలీసులు అరదండాలు వేశారు. వారి కథనం ప్రకారం.. నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. స్నేహితులు అజయ్ శర్మ, విజయ్‌లతో కలిసి వ్యభిచార దందాకు తెరలేపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని యువతులకు వలవేసి ఆపై వారితో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. గత ఐదేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ దందాకు పోలీసులు తాజాగా చెక్ పెట్టారు.

సినిమాల్లో అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు విటుల్లా నటించి ఆటకట్టించారు. బయటి వ్యక్తుల్లా నవీన్‌కు పోన్ చేసి అమ్మాయి కావాలని అడిగారు. డీల్ ఓకే అయిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరిని పంపుతున్నట్టు చెప్పాడు. అయితే, ఒక్కో మహిళకు రూ.60 వేల క్యాష్‌తోపాటు హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పాడు. పోలీసులు సరేననడంతో అమ్మాయిలతో కలిసి హోటల్‌కు వచ్చిన నవీన్‌ను అక్కడే మాటువేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
mumbai
Bollywood
casting director
S*x racket

More Telugu News