టిక్‌టాక్‌లో మైఖేల్ జాక్సన్‌ను మరపించిన యువకుడు.. అతడి అడ్రస్ కావాలన్న హృతిక్ రోషన్
Add ap7am to your home Screen

టిక్‌టాక్‌లో మైఖేల్ జాక్సన్‌ను మరపించిన యువకుడు.. అతడి అడ్రస్ కావాలన్న హృతిక్ రోషన్

  • హృతిక్ రోషన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు
  • డ్యాన్స్ వీడియోతో విషెస్ చెప్పిన అభిమాని
  • తాను చూసిన గొప్ప స్మూతెస్ట్ ఎయిర్ వాకరంటూ హృతిక్ ప్రశంస
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఎంతోమంది ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొస్తోంది. తాజాగా, టిక్‌టాక్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియోకు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఫిదా అయిపోయాడు. ఆ వీడియోలోని కుర్రాడి అడ్రస్ తెలిస్తే చెప్పండంటూ అభిమానులు అడుగుతున్నాడు.

హృతిక్ రోషన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టి 20 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఓ అభిమాని టిక్‌టాక్‌లో వీడియో చేశాడు. అనంతరం దానిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ హృతిక్ రోషన్‌ను ట్యాగ్ చేశాడు. ఆ వీడియోలోని యువకుడి డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయిన హృతిక్.. తాను చూసిన గొప్ప స్మూతెస్ట్ ఎయిర్ వాకర్ అతడేనని కితాబిచ్చాడు. అతడెవరని ఆరా తీశాడు. అతడి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అభిమాని వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన హృతిక్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమితాబ్ కూడా ఈ వీడియోను చూసి ‘అసాధారణమైన డ్యాన్స్’ అని కొనియాడాడు.
Hrithik roshan
Twitter
Bollywood
airwalker

More Telugu News