ప్రభాస్ హీరోగా త్రివిక్రమ్ మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ హీరోగా త్రివిక్రమ్ మూవీ

  • ప్రభాస్ తాజా చిత్రంగా 'జాన్'
  • తదుపరి సినిమా త్రివిక్రమ్ తో
  •  త్వరలోనే రానున్న క్లారిటీ    
ప్రస్తుతం ప్రభాస్ 'జాన్' సినిమాతో బిజీగా వున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. ఈ  సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. అల్లు అర్జున్ వంటి హీరోలు త్రివిక్రమ్ తో సినిమాలు చేశారు. ఇంతవరకూ త్రివిక్రమ్ - ప్రభాస్ కాంబినేషనే కుదరలేదు. అందువలన త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమా ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. త్రివిక్రమ్ కి ప్రభాస్ ముందుగానే ఒక మాట చెప్పి ఉండటం వలన, ప్రభాస్ కి తగిన కథను ఆయన సిద్ధం చేసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరేననే టాక్ వినిపిస్తోంది.
Prabhas
Trivikram

More Telugu News