11 ఏళ్ల కనిష్టానికి పడిపోనున్న భారత వృద్ధి రేటు
- 2008-09లో 3.1 శాతంగా నమోదైన జీడీపీ వృద్ధి రేటు
- ఈసారి 5 శాతానికి పరిమితం కానున్న జీడీపీ
- తయారీ రంగం ఢమాల్ మనడమే కారణమని అంచనా
అలాగే, ఈ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వస్తు తయారీ రంగం వృద్ధి రెండు శాతానికి పరిమితం కావొచ్చని కూడా తెలిపింది. కాగా,గతేడాది సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి భారత జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి (4.5 శాతం) కి పడిపోయింది. కేంద్రం కనుక తన ఖర్చులను తగ్గించని పక్షంలో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.