శబరిమలలోకి మహిళల ప్రవేశం.. 13 నుంచి సుప్రీంలో వాదనలు
- శబరిమలలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు
- తీర్పును పునఃపరిశీలించాలంటూ పిల్
- విచారణకు 9 మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనం
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా, ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ పిల్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 13 నుంచి వాదనలు విననున్నట్టు తెలిపింది.