'నీలాంబరి' తరహా పాత్రలో నటించాలనుంది: హీరోయిన్ ప్రియమణి
- కథానాయికగా ప్రియమణికి మంచి గుర్తింపు
- 'అసురన్' తెలుగు రీమేక్ లో అవకాశం
- అప్పుడే 17 ఏళ్లు గడిచిపోయాయన్న ప్రియమణి
అలాంటి ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."నటిగా వెండితెరకి పరిచయమై 17 ఏళ్లు అయింది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే సంతోషంగానే వుంది. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా 'మీ డ్రీమ్ రోల్ ఏమిటి?' అని అడుగుతున్నారు. 'పడయప్పా' (నరసింహా)లో రమ్యకృష్ణ పోషించిన 'నీలాంబరి' తరహా పాత్రను చేయాలనుంది. నా వాయిస్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలకి బాగుంటుందని అంతా అంటుంటారు. అందువలన ఆ తరహా పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.