YSRCP: విజయసాయిరెడ్డి గారూ, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడానికి సిగ్గుగా లేదా?: బుద్ధా వెంకన్న కౌంటర్

షార్ట్స్‌లో చూడండి
ప్రజా సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని చెబుతూ.. నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో ఏపీకి మూడో స్థానం వచ్చిన విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. వైసీపీ 6 నెలల పాలన అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్ ర్యాంక్ ఇచ్చిందా? మీ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయిందా? నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడానికి సిగ్గుగా లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ప్రభుత్వం కనుక మంచి పరిపాలన అందించి అవార్డులు తీసుకుంటే తానూ అభినందించేవాడిని కానీ, 2015-2019 వరకు చంద్రబాబు హయాంలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని గుర్తించి ఇచ్చిన ర్యాంకింగ్ ని జగన్ కష్టపడి సాధించినట్టుగా విజయసాయిరెడ్డి ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతోందంటూ ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
YSRCP
mp
vijayasaireddy
Telugudesam
Budda

More Telugu News