బాలీవుడ్ నటి నటాషాతో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం
- హ్యాచ్‌లో ప్రయాణిస్తూ నిశ్చితార్థం
- మే తేరా, తూ మేరీ జాన్, సారా హిందూస్థాన్ అంటూ పోస్ట్
- కొత్త జంటకు శుభాకాంక్షల వెల్లువ
పాండ్యా షేర్ చేసిన ఫొటోలో నటాషా తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తోంది. ‘మై తేరా, తూ మేరీ జాన్, సారా హిందూస్థాన్’ అని ఆ పోస్టుకు పాండ్యా క్యాప్షన్ తగిలించాడు. ఇక కాబోయే కొత్త జంటకు టీమిండియా సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సారథి కోహ్లీ, కుల్దీప్ యాదవ్, ధోనీ భార్య సాక్షి, అజయ్ జడేజా, కృనాల్ పాండ్యా భార్య పంఖూరి శర్మ, సోఫీ చౌదరి, సోనాల్ చౌహాన్, శ్రేయాస్ అయ్యర్, మన్‌దీప్ సింగ్ లతో పాటు ముంబై ఇండియన్స్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపింది.