Chandrababu: మళ్లీ మీరు ఏపీ సీఎం కావాలి... అమరావతిని కాపాడాలి: చంద్రబాబును కోరిన రాజధాని యువతి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు పర్యటిస్తున్నారు. ఎర్రబాలెంలో రైతుల దీక్షకు చంద్రబాబు, భువనేశ్వరి మద్దతు తెలిపారు. కొత్త సంవత్సరం రోజు ఆయన రైతుల మధ్యే గడుపుతున్నారు. ఈ సందర్భంగా రాజధాని మహిళా రైతులు తమ ఆవేదనను చంద్రబాబు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు ఓ యువతి తమ కష్టాలు చెప్పింది. 'జగన్ సీఎం అయిన తర్వాత మాకు ఇప్పటివరకు స్కాలర్ షిప్ అందలేదు. మా భవిష్యత్తు గురించి ఆలోచించి మా తల్లిదండ్రులు భూములు ఇచ్చారు. ఉన్న భవనాలను కూల్చుతున్నారు.. అంతేగానీ, రాజధాని కట్టడం లేదు. ఒక్క రాజధానిని కట్టలేకపోతున్నారు. మూడు రాజధానులు కడతామని ఎలా అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఓట్లు వేసినందుకు మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలనేలా పరిపాలిస్తున్నారు. మళ్లీ ఎవరినీ నమ్మకూడదనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం తమ చర్యలతో చాటి చెప్పింది.  మళ్లీ మీరే (చంద్రబాబు నాయుడు) సీఎం కావాలి. అమరావతి రైతులను కాపాడాలి. జై జవాన్, జై కిసాన్' అని ఆమె వ్యాఖ్యానించింది.    
Go Back to Shorts
Chandrababu
amaravati
Andhra Pradesh

More Telugu News