మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే మొదలైన అసంతృప్తి!
- హోం మంత్రి పదవిని ఎన్సీపీకి ఇచ్చేందుకు సిద్ధమైన ఉద్ధవ్
- కాంగ్రెస్ కు ప్రాధాన్యత లేని శాఖలు
- తీవ్ర నిరాశలో కాంగ్రెస్
అయితే, తమకు ఇవ్వజూపుతున్న పదవుల పట్ల కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, సహకార, వ్యవసాయ శాఖలను కాంగ్రెస్ ఆశించింది. కానీ, ఆ పార్టీకి ప్రాధాన్యత లేని, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండని శాఖలను ఇవ్వాలని ఉద్ధవ్ నిర్ణయించారట. దీంతో, కాంగ్రెస్ తీవ్ర నిరాశకు గురవుతోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులైనా గడవక ముందే అసంతృప్త జ్వాలలు మొదలవడంతో... ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుందో అనే సందేహాలు తలెత్తుతున్నాయి.