YSRCP: రాజధాని రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారు: వాసిరెడ్డి పద్మ

షార్ట్స్‌లో చూడండి
అమరావతి రాజధాని రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జీఎన్ రావు కమిటీ అన్ని జిల్లాలు పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించిందని చెప్పారు. రాజధాని పేరుతో మోసం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆమె ఆరోపించారు.

టీడీపీ పాలనలో అమరావతిలో నాలుగైదు తాత్కాలిక భవనాలు కట్టి గ్రాఫిక్స్ చూపించారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అటువంటి పనులు చేయట్లేదని తెలిపారు. టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
Go Back to Shorts
YSRCP
Andhra Pradesh
amaravati

More Telugu News