ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం... అమ్మాయి మాలో కలిసిపోవాలి: పెద్దమ్మ శ్యామలాదేవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం... అమ్మాయి మాలో కలిసిపోవాలి: పెద్దమ్మ శ్యామలాదేవి

  • తమది పెద్ద కుటుంబం అని వెల్లడి
  • అమ్మాయి అందరినీ కలుపుకునిపోయేలా ఉండాలని వివరణ
  • 'జాన్' సినిమా తర్వాత చేసుకుంటానన్నాడు
టాలీవుడ్ బ్రహ్మచారి ప్రభాస్ పెళ్లికోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కుటుంబసభ్యుల సంగతి సరేసరి. తాజాగా, ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి స్పందించారు. 'జాన్' సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ స్పష్టంగా చెప్పాడని, తాము కూడా ఆ ఘడియల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

అయితే, ప్రభాస్ ను చేసుకోబోయే అమ్మాయి తమలో సులభంగా కలిసిపోయేలా ఉండాలని, ఎందుకంటే తమది చాలా పెద్ద కుటుంబం అని శ్యామలాదేవి వివరించారు. అమ్మాయి అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం కలిగివుండాలని స్పష్టం చేశారు. అలాంటి అమ్మాయి దొరికితే ప్రభాస్ పెళ్లి చేస్తామని అన్నారు. ఇక, ప్రభాస్ పెళ్లిపై వచ్చే ఊహాగానాలను తాము పట్టించుకోమని, అవి తమకు నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయని తేల్చేశారు. 
Prabhas
Syamaladevi
Krishnamraju
Marriage
Tollywood

More Telugu News