మహీంద్రా అండ్ మహీంద్రా నాయకత్వంలో మార్పు... ఆనంద్ మహీంద్రాకు కొత్త బాధ్యతలు
- ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్న ఆనంద్ మహీంద్రా
- సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
- మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీగా పవన్ గోయెంకా పునర్నియామకం
ఉన్నతస్థాయి నాయకత్వంలో మార్పు కోసం మహీంద్రా గ్రూపు ఏడాదిపాటు తీవ్ర కసరత్తులే చేసింది. అందుకోసం నామినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక, ఆనంద్ మహీంద్రా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కంపెనీకి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తారని మహీంద్రా గ్రూపు ఓ ప్రకటనలో పేర్కొంది.