ట్రంప్‌కు మరో షాక్.. అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ గ్రీన్ సిగ్నల్
- ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి సమ్మతి
- సెనేట్‌లో రిపబ్లికన్లదే ఆధిపత్యం
- తీర్మానం వీగిపోయే అవకాశం
తీర్మానానికి అనుమతి లభించడంతో సెనేట్‌లో ట్రంప్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. తీర్మానానికి అక్కడ కూడా ఆమోదం లభిస్తే అభిశంసన ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, సెనేట్‌లో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండడం ట్రంప్‌కు ఊరటనిచ్చే అంశం. మరోవైపు, అభిశంసన ప్రక్రియను నిలిపివేయాలంటూ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి ట్రంప్ ఇటీవల లేఖ రాశారు. అయితే, దీనిపై స్పీకర్ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.