సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్ 3’పై హిందూ జాగ‌ృతి సమితి ఆందోళన.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
Add ap7am to your home Screen

సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్ 3’పై హిందూ జాగ‌ృతి సమితి ఆందోళన.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్

  • రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘దబాంగ్ 3’
  • హిందువులను కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఆరోపణ
  • తొలగించకుంటే సినిమా హాళ్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిక
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’కు సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్ 3’పై  హిందూ జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని ఓ పాట, కొన్ని సన్నివేశాలు సాధువులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సెన్సార్ బోర్డుతోపాటు మహారాష్ట్ర సర్కారుకు విజ్ఞప్తి చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల హిందూ జాగృతి సమితి కోఆర్డినేటర్ సునీల్ ఘన్వాట్ ఈ డిమాండ్ చేశారు. సాధువులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని, లేకుంటే తమ కార్యకర్తలు సినిమా థియేటర్ల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారని హెచ్చరించారు. సినిమాలోని అభ్యంతరకర సీన్లపై మహారాష్ట్ర హోంశాఖ కల్పించుకోవాలని డిమాండ్ చేశారు.
Salman Khan
Dabangg3
Bollywood

More Telugu News