మృత్యువులోనూ వీడని అనుబంధం.. అన్న అంత్యక్రియల అనంతరం తమ్ముడి మృతి

  • తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఘటన
  • కాళ్లు కడుగుకుంటూ కుప్పకూలి మృతి చెందిన తమ్ముడు
  • ఒకే రోజు ఇద్దరి మరణంతో గ్రామంలో విషాదం
అన్న అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికొచ్చిన తమ్ముడు కాళ్లు కడుగుకుంటూ కుప్పకూలి మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో జరిగింది. పట్టణానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి దూది గోపాలం సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించగా తమ్ముడు వెంకటరమణ (బూరయ్య) అన్నీ తానై చూసుకున్నాడు.

అనంతరం ఇంటికి వచ్చిన వెంకటరమణ ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్లు కడుగుకుంటుండగా అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. మృత్యువులోనూ అన్నదమ్ముల అనుబంధం విడిపోలేదని గ్రామస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, వ్యవసాయం చేసుకుని జీవించే వెంకటరమణకు ఇద్దరు కుమార్తెలు కాగా, గోపాలానికి ఇద్దరు కుమారులు, కుమారుడు ఉన్నారు. ఒకే రోజు అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Go Back to Shorts
samalkot
East Godavari District

More Telugu News