సముద్రంలో నిలిపి ఉంచిన ఓడను తునాతునకలు చేసిన బ్రహ్మోస్

సముద్రంలో నిలిపి ఉంచిన ఓడను తునాతునకలు చేసిన బ్రహ్మోస్

  • బ్రహ్మోస్ తాజా ప్రయోగం సక్సెస్
  • ఒడిశా తీరం నుంచి పరీక్ష
  • డీఆర్ డీవో ఆధ్వర్యంలో ప్రయోగం
భారత ఆయుధ సంపత్తిలో బ్రహ్మాస్త్రంగా పరిగణిస్తున్న అత్యాధునిక క్షిపణి బ్రహ్మోస్ ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ పరీక్ష కేంద్రం నుంచి బ్రహ్మోస్ ప్రయోగం నిర్వహించారు. ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించేలా డిజైన్ చేసిన ఈ సూపర్ సోనిక్ క్షిపణి ధ్వనివేగాన్ని మించిన వడితో దూసుకెళుతుంది. తాజాగా నిర్వహించిన ప్రయోగంలో సముద్రంలో సుదూరంగా నిలిపివుంచిన ఓడను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించింది. డీఆర్ డీవో ఆధ్వర్యంలో ఈ ప్రయోగం చేపట్టారు. బ్రహ్మోస్ క్షిపణుల రేంజ్ 450 నుంచి 500 కిలోమీటర్లు! బ్రహ్మోస్ మిసైల్ ను భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నదుల పేర్లు కలిసేలా దీనికి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు.
Brahmos
India
Russia
Odisha
DRDO
Missile

More Telugu News