ఆ ఆరోపణలు అబద్ధం.. కోడలే నన్ను వేధిస్తోంది: బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన లాలు అనుచరుడు శక్తియాదవ్
- ‘మేడంను ఐశ్వర్యనే వేధించింది’ అంటూ ఫిర్యాదు
- ఆరోపణలు కొట్టిపడేసిన ఐశ్వర్య తండ్రి
ఐశ్వర్యరాయ్ ఫిర్యాదుకు ప్రతిగా తమ అనుచరుడైన శక్తియాదవ్‌తో రబ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ‘మా మేడం రబ్రీదేవిని కోడలు ఐశ్వర్యనే వేధిస్తోంది’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శక్తియాదవ్ పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై ఐశ్వర్య తండ్రి చంద్రికారాయ్ స్పందించారు. ఆ ఆరోపణల్లో పసలేదని కొట్టిపడేశారు.