అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై నేడు అభిశంసన ఓటింగ్
- అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగాలు
- రాజకీయ లబ్ధి కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న డెమోక్రాట్లు
- గురువారం ఉదయం నుంచి నిన్న తెల్లవారుజాము వరకు కొనసాగిన విచారణ
వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ జోబిడెన్‌ను తప్పించేందుకు ట్రంప్ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ దేశంలో బిడెన్‌కు ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపించాలని ఒత్తిడి తీసుకొచ్చారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు జరిపించకుంటే ఆ దేశానికి అందించాల్సిన సైనిక సాయాన్ని నిలిపివేస్తామని బెదిరించినట్టు ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి.