ఆర్బీఐ ఆమోదం రాకముందే పదవి నుంచి ఎలా తొలగిస్తారు?: బాంబే హైకోర్టులో చందాకొచ్చర్ పిటిషన్
- ఐసీఐసీఐ యాజమాన్యంపై ఇప్పటికే కేసు దాఖలు చేసిన కొచ్చర్
- పిటిషన్ ను విచారించిన కోర్టు వివరణ కోరుతూ ఆర్బీఐకి నోటీసులు జారీ
- తదుపరి విచారణ డిసెంబర్ 18కి వాయిదా
ఆర్బీఐ అనుమతికి ముందే జనవరి 31న ఐసీఐసీఐ యాజమాన్యం ఆమెను విధులనుంచి తొలగించింది. అనంతరం దీనికి సంబంధించి అనుమతులు కోరుతూ బ్యాంక్ ఫిబ్రవరి 5న ఆర్బీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మార్చి 13న కొచ్చర్ తొలగింపును సమర్థిస్తూ.. ఆమోదముద్ర వేసింది. అయితే, ఆర్బీఐ అనుమతి రాకముందే తనను విధుల నుంచి ఎలా తొలగిస్తారంటూ కొచ్చర్ తన పిటిషన్లో ప్రశ్నించారు. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు ఆర్బీఐకి నోటీసులు జారీచేసింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 18న జరుగనుంది.