ప్రభాస్ కోసం కథను సిద్ధం చేసిన శంకర్ .. నిర్మాతగా దిల్ రాజు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ కోసం కథను సిద్ధం చేసిన శంకర్ .. నిర్మాతగా దిల్ రాజు!

  • శంకర్ తాజా చిత్రంగా 'భారతీయుడు 2'
  •  తదుపరి సినిమా విజయ్ తో 
  •  ప్రభాస్ కి కథ వినిపించాడంటూ టాక్ 
దక్షిణాదిన భారీ బడ్జెట్ తో భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుల జాబితాలో శంకర్ పేరు ముందుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన 'భారతీయుడు 2' సినిమాను రూపొందిస్తున్నాడు. కమలహాసన్ కథానాయకుడిగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన విజయ్ హీరోగా ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 ప్రభాస్ కోసం కూడా ఆయన ఒక కథను సిద్ధం చేశాడనేది తాజా సమాచారం. ప్రభాస్ కి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం శంకర్ ఒక పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశాడట. ఈ కథను ఆయన ప్రభాస్ కి వినిపించడం .. ఈ ప్రాజెక్టుకి నిర్మాతగా వ్యవహరించడానికి 'దిల్' రాజు ఆసక్తిని చూపించడం జరిగిపోయాయట. ఈ ముగ్గురి మధ్య ఇటీవల చర్చలు జరిగాయని అంటున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కనుందనే విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.
Prabhas
Shankar

More Telugu News