నాగబాబుకు వాళ్లంతా హ్యాండ్ ఇచ్చారా?
Add ap7am to your home Screen

నాగబాబుకు వాళ్లంతా హ్యాండ్ ఇచ్చారా?

  • పాప్యులర్ కామెడీ షోగా 'జబర్దస్త్'
  • మరో షోకి వెళ్లిపోయిన నాగబాబు
  • ప్రోమో ద్వారా ఇచ్చిన పంచ్ 
'జబర్దస్త్' కామెడీ షో స్టేజ్ పై సందడి చేసిన వాళ్లలో చాలామంది పాప్యులర్ అయ్యారు. సినిమాల్లోను అవకాశాలను సంపాదించుకుంటూ ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. అలాంటి ఈ షో నుంచి కొన్ని కారణాల వలన నాగబాబు తప్పుకున్నారు. ఆయనతో పాటు కొంతమంది టీమ్ లీడర్లు కూడా వెళ్లిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లంతా వేరే ఛానల్ వారి కొత్త కార్యక్రమంలోను కనిపించారు.

అయితే నాగబాబుతో కలిసి బయటికి అడుగుపెట్టిన వాళ్లలో కొందరు అప్పుడే ఆయనకి హ్యాండ్ ఇచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. తాజాగా నాగబాబు నిర్వహిస్తున్న షో నుంచి వదిలిన ప్రోమో, ఆ వార్త నిజమేననిపించేలా వుంది. 'ఎంతమంది ఉన్నారన్నది కాదురా .. ఎవడున్నాడన్నది ముఖ్యం' అంటూ .. తనని తాను చూపించుకుంటూ .. ఈ ప్రోమోలో నాగబాబు చెప్పిన డైలాగ్ గురించే ఇప్పుడు ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు.
Nagababu

More Telugu News