నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు: ఫడ్నవీస్
- రూ. 40 వేల కోట్లను కేంద్రానికి తిప్పి పంపారంటూ ఫడ్నవీస్ పై ఆరోపణలు
- ఎలాంటి నిధులను కేంద్రానికి పంపలేదన్న ఫడ్నవీస్
- బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ మినహా మహా ప్రభుత్వం చేతిలో మరేమీ లేదని వ్యాఖ్య
ఇదంతా పూర్తి అసత్య ఆరోపణ అని ఫడ్నవీస్ అన్నారు. తన మూడు రోజుల పాలనలో ఎలాంటి నిధులను కేంద్రానికి తిప్పి పంపలేదని ఆయన చెప్పారు. బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ చేయడం మినహా, మహారాష్ట్ర ప్రభుత్వం పాత్ర మరేమీ లేదని తెలిపారు. అసలు ఎటువంటి నిధులను పంపమని కేంద్ర ప్రభుత్వం తమను అడగడం కానీ, తాము పంపడం కానీ జరగనేలేదని చెప్పారు.