సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, ప్రియాంకా చోప్రా జిందాబాద్... నవ్వులు పూయిస్తున్న కాంగ్రెస్ నేత నినాదాల వీడియో!
- న్యూఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ
- గాంధీ... అనబోయి చోప్రా అనేసిన నేత
- క్షమాపణలు చెప్పిన సభ నిర్వాహకులు
ఇక ఆ తరువాత జరిగింది అసలు సంగతి. ప్రియాంకా గాంధీ... అనాల్సిన సురేంద్ర పొరపాటున ప్రియాంకా చోప్రా... అనేశారు. కార్యకర్తలు జిందాబాద్ చెప్పేశారు. దీంతో అవాక్కైన కార్యక్రమ నిర్వాహకులు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ముందురోజు రాత్రి ప్రియాంకా చోప్రా సినిమాను సురేంద్ర చూసివుంటారని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ లో ఎప్పుడు చేరారని ప్రశ్నిస్తున్నారు. నెట్టింట వైరల్ అయిన వీడియోను మీరూ చూడవచ్చు.