అవే చివరి విధులు... బుధవారం నాడు ప్రియాంకా రెడ్డి ఏం చేశారంటే..!
- బుధవారం కొల్లూరు వెళ్లిన ప్రియాంక
- మధ్యాహ్నం 2.30కి విధులు ముగించుకుని వెనక్కు
- అదే రోజు రాత్రి హత్యాచారం
ఇటీవల పశువులకు గాలి కుంటు వ్యాధి రాకుండా టీకాల కార్యక్రమాన్ని నిర్వహించగా, ప్రియాంక చురుకుగా పాల్గొన్నారు. ముక్కుసూటి అధికారిణిగా గుర్తింపు పొందిన ప్రియాంకకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమని, తమ పశువులకు రోగాలు వస్తే, ఎన్నోమార్లు ఆమే స్వయంగా వచ్చి మందులిచ్చారని కొల్లూరు వాసులు కన్నీరు పెట్టుకున్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడిలా జరగటాన్ని జీర్ణించుకోలేకున్నామని అంటున్నారు.