యాంకర్ సుమ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి.. మొక్కనాటి సెల్ఫీ దిగిన మంచు లక్ష్మి
- ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్
- ఇటీవల మంచు లక్ష్మికి సుమ ఛాలెంజ్
- ఇందులో భాగం అయినందుకు మంచు లక్ష్మి హర్షం
తన ఇంటి ఆవరణలో మొక్క నాటి, దానితో సెల్ఫీ తీసుకుంది. ఇందులో తాను భాగం అయినందుకు హర్షం వ్యక్తం చేసింది. కాగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కూడా స్వీకరించి తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ఇప్పటికే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు వారంతా అభినందనలు తెలిపారు.