నాకు రిటైర్మెంట్ సమయం వచ్చేసింది: అమితాబ్ సంచలన వ్యాఖ్యలు
Add ap7am to your home Screen

నాకు రిటైర్మెంట్ సమయం వచ్చేసింది: అమితాబ్ సంచలన వ్యాఖ్యలు

  • తన బ్లాగులో స్వయంగా పేర్కొన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ 
  • బుర్ర ఒకటి ఆలోచిస్తోంది...శరీరం మరొకటి చెబుతోంది 
  • పరోక్షంగా అవి రిటైర్మెంట్ సిగ్నల్స్ అని నా భావన

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపారు. చిత్ర పరిశ్రమ నుంచి తాను నిష్క్రమించాల్సిన సమయం వచ్చేసిందన్నారు. 'మనసు ఉత్సాహపడుతున్నా శరీరం సహకరించడం లేదు. బుర్ర  ఒకటి ఆలోచిస్తోంది, చేతి వేళ్లు మరొక సందేశాన్నిస్తున్నాయి. బహుశా నేను రిటైర్ కావాలని పరోక్షంగా అవి తెలియజేస్తున్నాయి అనుకుంటా' అంటూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. నా శరీరం సిగ్నల్స్ ఇస్తున్నప్పటికీ  నేను ఇంట్లో కూర్చోలేకపోతున్నానని పేర్కొన్నారు.

'బ్రహ్మాస్త్ర' షూటింగ్ లో భాగంగా అమితాబ్ మనాలీ వెళ్లారు. అక్కడి నుంచి కారులో సెట్స్ కు వెళ్తున్నప్పుడే ఈ రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు. డెబ్బయి ఏళ్ల వయసులో యాభై ఏళ్లుగా చిత్ర పరిశ్రమతో అనుబంధం అమితాబ్ ది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బాలీవుడ్ స్టార్ గత కొన్నాళ్లుగా క్షయ వ్యాధితో సతమతమవుతున్నారు.

దీనికి చికిత్స పొందుతున్నప్పటికీ వయసు రీత్యా ఒక్కోసారి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఇటీవలే అనారోగ్యంతో కొన్నాళ్లు ఆసుపత్రిలో గడిపారు. షూటింగ్ లకు గ్యాప్ ఇవ్వాలని వైద్యులు తెలియజేసినా డిశ్చార్జి అయిన రెండు రోజులకే ఆయన సెట్స్ కు వెళ్లిపోయారు.

Bollywood
superstar
Amitabh Bachchan
retairment

More Telugu News