అమ్మకాల్లో ఎదురులేని మారుతి ఆల్టో!
- ఇప్పటివరకు 38 లక్షల అమ్మకాలు
- 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన చిన్నకారు
- దశాబ్దకాలం పైగా మార్కెట్లో ఆధిపత్యం
చూడచక్కని రూపం, అందుబాటు ధర, అధిక మైలేజి వంటి అంశాలు ఆల్టో అమ్మకాల్లో పురోగతికి దోహదపడుతున్నాయని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా మారుతున్న మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మారుతి సంస్థ ఆల్టో బీఎస్-6 వెర్షన్ కూడా తీసుకువచ్చింది.