మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా ఇలా వ్యవహరించారు.. వెంటనే బలపరీక్ష నిర్వహించాలి: సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్
- శనివారం ఉదయం 5 గంటల్లోపు అంతా అయిపోయింది
- రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉంది
- బలపరీక్షకు సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్ గా ఉంటారు
అజిత్ పవార్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... బీజేపీకి మద్దతు ఇవ్వాలనే అధికారాన్ని ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ కు కల్పించారని చెప్పారు. ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. అజిత్ పవార్ ఇచ్చిన లేఖ ఆధారంగా గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారని వివరించారు.