డిసెంబరు 26న సూర్యగ్రహణం.. అయ్యప్ప ఆలయం మూసివేత
- 26న ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఆలయం మూత
- పంబ, మలికాపురంలోని ఆలయాలనూ మూసివేయనున్న అధికారులు
- నాలుగు గంటలపాటు కొనసాగనున్న సూర్యగ్రహణం
ఆలయాన్ని తెరిచిన అనంతరం పుణ్యహవచన చేసి పూజలు కొనసాగిస్తారు. మాలికాపురం, పంబలో ఉన్న ఆలయాలను కూడా 26న మూసివేయనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు. కాగా, మండల పూజల సందర్భంగా ఈ నెల 17న ఆలయాన్ని తెరిచారు. రికార్డు స్థాయిలో భక్తులు సందర్శించుకుంటున్నారు.