'జార్జిరెడ్డి' సెన్సార్ పూర్తి.. విడుదలకి సిద్ధం
- విద్యార్థి నాయకుడి బయోపిక్ గా 'జార్జి రెడ్డి'
- సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్
- ఈ నెల 22వ తేదీన విడుదల
'జార్జిరెడ్డి' సినిమాను గురించి చిరంజీవి .. నాగేంద్రబాబు .. పవన్ కల్యాణ్ తదితరులు ప్రస్తావించడంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి పెరిగింది. పవన్ అభిమానులంతా కూడా ఈ సినిమా పట్ల ఆసక్తితో వున్నారు. విడుదలకి ముందు ఈ సినిమా అందరి దృష్టికి చేరడం వసూళ్లపరంగా కలిసొచ్చే విషయం. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, ఏ స్థాయిలో వారికి కనెక్ట్ అవుతుందో చూడాలి.