మందేసి వైసీపీ నేతలతో చిందేసిన ఎమ్మార్వోకు షాక్ ఇచ్చిన అధికారులు

శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వోపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఓ తోటలో ఉద్యోగులతో మందు పార్టీ చేసుకుని... ఆ తర్వాత వైసీపీ నేతలతో కలసి డ్యాన్స్ చేసిన ఎమ్మార్వో నరసింహమూర్తికి పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మార్వో మందు కొట్టి, చిందేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంతో ఆగ్రహానికి గురైన ఉన్నతాధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.

Go Back to Shorts
MRO
Dance
Party
Srikakulam District

More Telugu News