ఇంటర్ చదువుతున్నప్పుడు జార్జిరెడ్డి పేరు తొలిసారిగా విన్నాను!: చిరంజీవి
- నేను చదువుకునే రోజుల్లో 'జార్జి రెడ్డి' పేరు విన్నాను
- పాట వినగానే ఉద్వేగానికి లోనయ్యాను
- ఇలాంటి సినిమాలు రావాలన్న చిరంజీవి
"1972లో నేను ఒంగోలులో ఇంటర్మీడియెట్ చదువుకునే రోజుల్లో 'జార్జి రెడ్డి' పేరు విన్నాను. మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమా కారణంగా వింటున్నాను. ఈ సినిమాలోని 'అడుగు .. అడుగు' అంటూ సాగే పాటను వింటూ నేను ఉద్వేగానికి లోనయ్యాను. జార్జి రెడ్డి ఆశయం .. ఆచరణ .. విద్యార్థినాయకుడిగా ఆయన సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారని తెలుస్తోంది. చైతన్యవంతులను చేసే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి .. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.