రాబోయే రోజుల్లో ఆశ్చర్యకర పరిణామాలు: బాంబు పేల్చిన రజనీకాంత్
- రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు
- ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏళ్ల తరబడి కలలు కనాల్సిన పనిలేదు
- సీఎం అవుతానని పళనిస్వామి కలగన్నారా?
2017లోనే రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్ ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ పెట్టడంపైనా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇటీవల బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ఊహాగానాలను రజనీ ఖండించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. తన గురించి తాను చేసుకున్నవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.