Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. బికనేర్ జిల్లా శ్రీదంగర్‌గఢ్ సమీపంలో బస్సు-లారీ ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Go Back to Shorts
Rajasthan
Road Accident

More Telugu News