ఐసీసీ టాప్-10 ర్యాంకుల్లోకి దూసుకొచ్చిన షమీ
- షమీకి తాజా ర్యాంకుల్లో 7వ స్థానం
- ఒక్కసారిగా 8 స్థానాలు ఎగబాకిన షమీ
- బ్యాటింగ్ ర్యాంకుల్లో కోహ్లీకి రెండోస్థానం
ఐసీసీ బౌలర్ల జాబితాలో టాప్ లో ఆస్ట్రేలియా యువ పేసర్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రబాడా, జాసన్ హోల్డర్ ఉన్నారు. గాయం కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్ కు దూరమైన బుమ్రా నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు పదో స్థానం దక్కింది.
ఇక బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. పుజారా 4, రహానే 5 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా టెస్టు జట్టు ఓపెనర్ గా ప్రమోషన్ దక్కించుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 10వ ర్యాంకు అందుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ స్థానం నిలుపుకున్నాడు.