అయ్యప్ప భక్తుల విషయంలో డీజీపీ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.. వాటినే అమలు చేస్తున్నాం: రాచకొండ సీపీ మహేశ్ భగవత్
- అయ్యప్ప మాల వేసుకొనే పోలీసులు సెలవుపై వెళ్లాలని ఇటీవల ఆదేశాలు
- పలువురి నుంచి విమర్శలు
- సర్వీస్ నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నామన్న మహేశ్ భగవత్
ఈ నేపథ్యంలో మహేశ్ భగవత్ ఈ విషయంపై స్పందించారు. పోలీసులు విధులు నిర్వహించే క్రమంలో సర్వీస్ నిబంధనల మేరకు వ్యవహరించాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని, వాటినే తాము అమలు చేస్తున్నామని తెలిపారు. అయ్యప్ప భక్తుల విషయంలో కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ విషయంపై కొందరు రాచకొండ పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని తెలిపారు.