సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు: మోదీ
- కోల్ కతాలో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభం
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని
- సైన్స్ కు ఓటమి ఉండదంటూ వ్యాఖ్యలు
నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు తమ ప్రభుత్వం సంస్థాగత సాయం అందిస్తుందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడూ ఓటమి ఉండదని, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయని అన్నారు. చంద్రయాన్-2 కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని, కానీ వారు అనుకున్నది సాధ్యపడలేదని తెలిపారు. కోరుకున్న ఫలితాలు రాకపోయినా మిషన్ మాత్రం విజయవంతమైందని పేర్కొన్నారు.