ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని పెంచిన ట్రాయ్
- ఇన్ కమింగ్ రింగ్ 30 సెకన్లు ఉండాలని ఆదేశం
- ల్యాండ్ లైన్లకు ఈ సమయం 60 సెకన్లుగా నిర్ణయం
- టెలికాం సంస్థల మధ్య వివాదానికి తెర
గతంలో ఇన్ కమింగ్ రింగ్ సమయానికి ఎలాంటి పరిమితి లేదు. తొలుత ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని జియో 25 సెకన్లకు తగ్గించింది. అనంతరం ఎయిర్ టెల్, వోడాఫోన్ లు కూడా పోటీగా 25 సెకన్లుకు తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ సమస్యలను ఎదుర్కొన్నారు. మిస్డ్ కాల్స్ పెరిగిపోయాయి. తాజా నిర్ణయంతో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న అవాంఛనీయ పోటీకి తెరపడినట్టే.