వాట్సాప్ లో చొరబడిన స్పైవేర్... హ్యాకింగ్ బారిన ప్రముఖుల ఫోన్లు
- ఇజ్రాయెల్ లో పురుడుపోసుకున్న 'పెగాసస్' స్పైవేర్
- వాట్సాప్ భద్రతను అపహాస్యం చేసిన సైబర్ భూతం
- ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ప్రముఖులకు తప్పని 'పెగాసస్' బెడద
వాట్సాప్ లో 'పెగాసస్' స్పైవేర్ ను తాము ఈ ఏడాది వేసవిలోనే గుర్తించి అడ్డుకున్నామని, వెంటనే ప్రభావిత వ్యక్తులకు సమాచారం అందించామని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ లో వీడియో, ఆడియో కాల్స్ వ్యవస్థ అయిన వీఓఐపీ స్టాక్ లో ఉన్న లోపం హ్యాకర్ల పాలిట వరమైంది. ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు 'పెగాసస్' స్పైవేర్ ను వాట్సాప్ లోకి చొప్పించగలిగారు.
ఈ స్పైవేర్ ఒక్కసారి ఫోన్ లో ప్రవేశించాక కీలక సమాచారాన్నంతా నిర్దేశిత సర్వర్ కు పంపుతుంది. వాట్సాప్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుండడం ద్వారా స్పైవేర్ ప్రభావం నుంచి బయటపడొచ్చని సైబర్ నిపుణులు అంటున్నారు.