Mahesh Babu: నాకూ మహేశ్ కి మధ్య సవాల్ చేసే సీన్స్ వుండవు: విజయశాంతి

షార్ట్స్‌లో చూడండి
అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ద్వారానే విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు .. విజయశాంతి మధ్య నువ్వా? .. నేనా? అంటూ సాగే పవర్ఫుల్ సీన్స్ వుండనున్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది.

తాజాగా ఈ విషయంపై విజయశాంతి స్పందించారు. "నాకూ .. మహేశ్ బాబుకు మధ్య పోటాపోటీ సన్నివేశాలేమీ వుండవు. ఛాలెంజ్ చేయడం .. సవాళ్లు విసురుకోవడం వంటి సీన్స్ వుండవు. సినిమాలో కథా పరంగా మా పాత్రల మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. ప్రేక్షకులకు మా పాత్రలు బాగా కనెక్ట్ అవుతాయి" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Mahesh Babu
Rashmika
Vijayashanthi

More Telugu News